ఏపీలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్బ్రాంతి

Spread the love

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.  మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నా ఆలోచనలు, ప్రార్థనలు ఎప్పుడూ వారితోనే ఉంటాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని , మార్కాపురం  జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని మోడీ అన్నారు.  ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుందని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *