రిలీజైన నాగశౌర్య  ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీ ట్రైలర్

Spread the love

తనదైన శైలిలో ప్రేమకథలను ఎంచుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై మంచి నటనతో ఆకట్టుకున్నాడు యువ హీరో నాగశౌర్య. యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో కుర్రకారు మనసు గెలుచుకోవడమే కాకుండా, స్వచ్ఛమైన భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అతని సినిమాల్లో ఉండే ఫ్రెష్‌నెస్, సింపుల్‌గా ఉంటూనే మనసును తాకే నటన అందరినీ ఆకట్టుకున్నాయి. కేవలం యువతకే పరిమితం కాకుండా, ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తన కథా బలంతో అలరిస్తూ, టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం తన నటన, యాక్షన్ సీన్స్ తో నాగశౌర్య సరికొత్తగా కనిపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ, శ్రీదేవి విజయ్ కుమార్, మైమ్ గోపీ, పృథ్వీ, బ్రహ్మాజీ, నరేష్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు  రామ్ దేసిన దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాసరావు, విజయ్ కుమార్, డా.అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *