గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అక్కినేని నాగార్జున, ఇప్పుడు తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మైల్ స్టోన్ చిత్రానికి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా నిర్మిస్తోంది. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జోరుగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టాకీ భాగం సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జునను ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. కథనం మొత్తం కూడా పవర్ఫుల్ యాక్షన్, ఎమోషన్‌తో నిండినదిగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన ఈ 100వ సినిమా… నాగార్జున కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను మేకర్స్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది.