ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ రిలీజ్ డేట్ ఫిక్స్…!

Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అభిమానులతో పాటు  ఇప్పటికే ప్రేక్షకుల్లో  భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి ఇది ఒక పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, అంతకుమించిన స్థాయిలో ఉండబోతుందనే భావన ఏర్పడింది. ప్రశాంత్ నీల్ స్టైల్ భారీ రేంజ్ టేకింగ్, యాక్షన్ సన్నివేశాలు, మాస్ డైలాగ్స్, హీరో ఎలివేషన్స్ అన్ని ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. మరోవైపు ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా  వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఒకవైపు భారీ యాక్షన్, మరోవైపు ఎమోషన్స్ అన్ని కలిపి ఈ సినిమా ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా నిలవబోతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. గత సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ఈ సినిమా ద్వారా ఆయన ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘డ్రాగన్’ సినిమా నుండి అప్డేట్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *