తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే:బీ.ఆర్.ఎస్ అధినేత కే.సీ.ఆర్

Spread the love

ప్రజల మంచి కోరే ప్రతీవాళ్లు ఒక్కటి కావాల్సిందేనని పోరాటం చేయాల్సిందేనని తెలంగాణ మాజీ సీఎం, బీ.ఆర్.ఎస్ అధినేత కే.సీ.ఆర్ అన్నారు.  జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. భారీగా శ్రేణులు ఈ సభకు తరలివచ్చారు. కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ఈ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ ప్రారంభం కావాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని రాష్ట్రంలో ఎవ్వరిని కదిలించినా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప  ఒక్కరికి మంచి చెయ్యలేక పోతుందని విమర్శించారు.  బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.   హైడ్రా పైనా విమర్శలు గుప్పించారు. తెచ్చారు, నిజామాబాద్ నీడ్రా, జగిత్యాలలో జీడ్రా తెస్తామనిపీసీసీ ఛీఫ్ అంటున్నారు.  బీఆర్ఎస్ అధికారంలోకి మొదటి సంతకంతోనే హైడ్రా తీసి అవతల పడేస్తామన్నారు.  మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతామని అంటున్నారు. మూసీ సుందరీకరణ చెయ్యాల్సిందే, అంతేగాని పేదల ఇండ్లు కూల్చవద్దన్నారు.  మూసీ నగర ప్రజల కోసం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని మండిపడ్డారు.  ఏ రంగంలో చూసినా ఒక రకమైన దోపిడి చేస్తున్నారు. కరెంట్ మోటార్లకు మీటర్ పెట్టమని ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టినా  రైతుల కోసం మీటర్ పెట్టనియ్యకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు.  మీటర్ పెడితే కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం ఈ ప్రభుత్వం సంతకం పెట్టిందన్నారు. యాదవులకు గొర్రె పిల్లలు, ముదిరాజ్‌లకు చేప పిల్లలు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేశారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.  ఈ ప్రభుత్వం తీరు కూల్చివేతలు, కాల్చివేతలు తప్ప ఏం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే మొదలు కాబోతుందని స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *