భారీ ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్న ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ 

Spread the love

ప్రేక్షకులలో దేశ భక్తి కథలకి ఉన్న ఆదరణే వేరు. మంచి కంటెంట్ తో తెరకెక్కుతూ భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇటీవల ప్రముఖ  ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ దీనికి మరో ఉదాహరణగా నిలిచింది. విడుదలైన మొదటి వారం నుంచే ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన రావడం ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. రెండు వారాలు దాటిపోయినా ఇంకా టాప్ ట్రెండింగ్ జాబితాలో కొనసాగుతుండటం దీని ఆదరణకు నిదర్శనం. సోషల్ మీడియాలో కూడా ఈ సిరీస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూసిన ప్రేక్షకుల నుంచి ఎక్కువ శాతం సానుకూల స్పందన రావడం ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్ అయింది. చాలామంది దీనిని కేవలం యుద్ధ కథగా కాకుండా దేశభక్తి, సాహసం, త్యాగం కలిసిన మంచి కంటెంట్ తో తెరకెక్కడంతో ఆదరిస్తున్నారు. 1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఇది రూపొందింది. కార్గిల్ యుద్ధం ప్రారంభానికి ముందు దేశంలో నెలకొన్న పరిస్థితులను కథలో చక్కగా చూపించారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్‌తో శాంతి చర్చలు జరిపే ప్రయత్నాల్లో ఉండగా, మరోవైపు సరిహద్దుల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. భారత స్థావరాలపై శత్రుదేశం దాడులు ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం, ముఖ్యంగా వాయుసేన ఎలా స్పందించింది? ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంది? అనే అంశాలను కథలో ప్రధానంగా చూపించారు. భారత సైన్యం ఎంత నైపుణ్యం ప్రదర్శించింది. యుద్ధం అంటే కేవలం ఆయుధాలు పట్టుకుని చేయడం మాత్రమే కాదు. ఎన్ని వ్యూహాలు, ఎంత తెగువ, ఎన్ని త్యాగాలు ఇటువంటివన్నీ ఇందులో చూపించారు. తెరపై దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటోంది.  ప్రతి ఎపిసోడ్‌లో నిర్మాణ విలువలు కనిపిస్తాయి. యుద్ధ ప్రాంతాల సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైటర్ జెట్ల విన్యాసాలు, వైమానిక దాడుల సన్నివేశాలు అన్నీ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తాయి. వెబ్ సిరీస్ కంటే ఒక భారీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారక్ రైనా, అర్నవ్ భాసిన్,వినయ్ పాఠక్, మను రిషి చద్దా వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించారు.అభిజీత్ సింగ్ పర్మార్, కుశాల్ శ్రీవాస్తవలు క్రియేటర్స్.  ఓని సేన్ దర్శకత్వం వహించారు. మ్యాచ్ బాక్స్ షాట్స్, ఫీల్ గుడ్ ఫిలిమ్స్ పతాకాలపై మెహబూబ్ పాల్ సింగ్ బ్రార్, సరితా పాటిల్, సంజయ్ రౌట్రాయ్ నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *