
Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ, తాను ఒప్పుకున్న చిత్రాలను వేగంగా పూర్తి చేసే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ మరియు ఇటీవలే విడుదలైన ‘ఓజీ’ చిత్రాలను పూర్తి చేశారు. త్వరలో ఆయన నుంచి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రానుంది.’ఓజీ’ సినిమా ప్రమోషన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ యూనివర్స్’ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించడంతో, ఆయనకు సినిమాలపై ఆసక్తి ఇంకా తగ్గలేదని సినీ వర్గాలకు స్పష్టమైంది.
పవన్ సంకేతాలు అర్థం చేసుకున్న పలువురు అగ్ర దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ ప్రయత్నాలలో భాగంగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం పవన్ కళ్యాణ్‌తో ఒక చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది.దిల్ రాజు విషయం పక్కన పెడితే, మరొక దర్శకుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఆయనే డైరెక్టర్ మెహర్ రమేష్. ఈసారి తప్పకుండా హిట్ కొట్టి తన సత్తా నిరూపించుకోవాలనే లక్ష్యంతో మెహర్ రమేష్ పవన్‌ను ఒప్పించేందుకు పదేపదే కలుస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని, తన ప్రతిభను చాటుకోవాలని మెహర్ చూస్తున్నారని తెలుస్తోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ సమయంలోనే మెహర్ రమేష్.. పవన్‌ను తరచూ కలుస్తూ, ఒక విభిన్నమైన కథాంశంతో ఆయనను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని టాక్. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా, మెహర్ తన సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. Pawan Kalyan Fans.
అయితే, ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ‘ఓజీ’ ఇచ్చిన ఉత్సాహాన్ని మెహర్ రమేష్ సినిమా తీసేస్తుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. “అయ్యా, మీకు దండం పెడతాం, దయచేసి ఆయనతో సినిమా వద్దు” అని కొందరు అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. “వద్దు బాబు వద్దు, నీకు సమస్కారం” అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే “రిటైర్‌మెంట్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? వామ్మో.. మళ్లీ అజ్ఞాతవాసానికి పంపాలని గట్టిగా నిర్ణయించుకున్నారా ఏంటి?” అంటూ సెటైర్లు వేస్తున్నారు.మొత్తానికి, పవన్ కళ్యాణ్ – మెహర్ రమేష్ కాంబినేషన్ అనే ఊహాగానం కేవలం వార్తగా వచ్చినందుకే పవన్ ఫ్యాన్స్ ఇంతలా టెన్షన్ పడుతుండటం గమనార్హం.