అందుకే అతను ట్రెండ్ ఫాలో కాడు..ట్రెండ్ సెట్ చేస్తాడు!

Spread the love

Pawan Kalyan’s World Record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లలో గెలుపొంది నయా రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేశాడని.. అది కూడా వరల్డ్ రికార్డే క్రియేట్ చేశాడని సినీ, రాజకీయ విశ్లేషకులు చెబుతుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. పవర్ స్టార్ క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డ్ ఏంటి..? వీరమల్లు క్రియేట్ చేస్తున్న రికార్డుల పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ వీడియో చూడాల్సిందే.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనే విషయం తెలిసిందే. అయితే.. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండి సినిమా చేయడం.. అది కూడా తక్కువ టైమ్ లోనే మూడు సినిమాలు కంప్లీట్ చేయడం అనేది బహుశా ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని.. ఈ రకంగా కూడా పవన్ కళ్యాణ్ రికార్డ్ క్రియేట్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాలను చక చకా కంప్లీట్ చేశారు. మరో సినిమా చేస్తారా అని జర్నలిస్టులు అడిగితే.. హీరోగా నటించడం అంటే కష్టం.. కాకపోతే నిర్మాతగా సినిమాలు తీస్తానని ప్రకటించడం విశేషం. Pawan Kalyan’s World Record.

ఇక వీరమల్లు రికార్డ్స్ విషయానికి వస్తే.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీరమల్లు గురించి చర్చ. పవన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవ్వడం.. పైగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లు థియేటర్ల దగ్గర కలెక్షన్ల విధ్వంసం కనిపిస్తుంది. చిన్న ఊరా..? పెద్ద ఊరా..? అనే తేడా లేదు.. ఏ ఊరైనా వీరమల్లు థియేటర్ల దగ్గర విధ్వంసమే కనిపిస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సినీ ప్రముఖులే కాదు.. రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా వీరమల్లు విజయం సాధించాలని కోరుకుంటూ పోస్టులు పెట్టడం వైరల్ అయ్యింది.

ఓవర్ సీస్ లో ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ కు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే.. దాదాపు అన్ని థియేటర్లోనూ వీరమల్లునే. కనీవినీ ఎరుగని రీతిలో వీరమల్లు సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసినా.. ఇంకా టిక్కెట్లు దొరకని పరిస్థితి. అభిమానులు అయితే.. వేరే లెవల్లో ఉందని.. ఈ సినిమా తమకు అద్భుతమైన అనుభూతి కలిగించింది అంటూ టీమ్ అని అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే.. మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసాయి అని చెప్పచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వీరమల్లు ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో నయా రికార్డ్ క్రియేట్ చేశాడు.. మరి.. ఫుల్ రన్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/krish-writes-open-letter-about-veeramallu-krishs-letter-goes-viral-on-social-media/