
Veeramallu vandalized at the box office: వీరమల్లు.. అన్ని అడ్డంకులు దాటుకుని థియేటర్లోకి వచ్చింది.. అయితే.. గత కొన్ని రోజులుగా చెప్పుకోదగ్గ బజ్ లేని వీరమల్లుకు పవర్ స్టార్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా ఊహించనంత బజ్ క్రియేట్ అయ్యింది. ఒకే రోజు మీడియా మీట్ ఏర్పాటు చేయడం.. అదే రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా మీడియాకు స్పెషల్ ఇంటర్ వ్యూ కూడా ఇవ్వడం.. వైజాగ్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి.. అంచనాలను అందుకుందా..? వీరమల్లు రియల్ టాక్ ఏంటి..? కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాని క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా కావడం.. పైగా పవన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవ్వడంతో అభిమానులే కాదు.. కామన్ ఆడియన్స్ సైతం థియేటర్ల వైపు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు.. ఓవర్ సీస్ లో అవ్వచ్చు.. బుకింగ్స్ ఇలా ఓపెన్ చేసారో లేదో అలా వెంటనే అయిపోయాయి. దీనిని బట్టి వీరమల్లు కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థమౌతుంది. Veeramallu vandalized at the box office.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విజయవాడ సమీపంలోని కొల్లూర్‌లో దొరికిన కొహినూర్ వజ్రం నిజాం నవాబ్ వద్దకు ఎలా వెళ్లింది. వారి నుంచి బ్రిటీష్ వారికి ఎలా చేరింది..? దాన్ని దొంగిలించుకురావాలనే పనిని వీరమల్లుకి నిజాం నవాబ్ అప్పచెప్పడం.. దాని కోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ కథ. అయితే.. కథనం ఎవరూ ఊహించని విధంగా వావ్ అనిపించేలా ఉందట. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడా బోర్ అనేది లేకుండా అద్భుతం అనిపించే విజువల్స్ తో ఈ సినిమాని రూపొందించిన విధానం అదిరింది అంటున్నారు. భారీ పీరియాడిక్ మూవీ అంటే.. అందరికీ కనెక్ట్ కాదేమో కొందరికే కనెక్ట్ అవుతుందేమో అనుకుంటారు. అయితే.. దీనిని క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారని సినిమా చూసిన జనాలు చెబుతున్న మాట. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే వేరే లెవల్లో ఉందని.. పవర్ స్టార్ పర్ ఫార్మెన్స్ అదరగొట్టేసాడని.. మంచి ఫీల్ అండ్ ఎమోషన్ తో ఆడియన్స్ బయటకు వచ్చేలా ఈ మూవీని తీసారు అంటూ అభినందిస్తున్నారు.
టాక్ అయితే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. కలెక్షన్స్ అయితే.. ఫస్ట్ డే ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వస్తుంది అనేది సినీ పండితుల అంచనా. ఏ సెంటర్ లో చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో.. దుమ్ములేపుతుంది. పాత రికార్డులను బద్దలుకొడుతూ సరికొత్త రికార్డుల దిశగా వీరమల్లు దూసుకెళుతున్నాడు. మరి.. ఫస్ట్ వీక్ లో ఎంత కలెక్ట్ చేస్తాడో.. ఎలాంటి రికార్డు సెట్ చేస్తాడో చూడాలి.