
Prabhas Fauji Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్పిరిట్ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే కల్కి 2, సలార్ 2 కూడా ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఫౌజీ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఫౌజీ ఎలా ఉండబోతుంది..? రిలీజ్ డేట్ ఎప్పుడు…?
ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ.. సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. దీంతో రాజాసాబ్ వచ్చేది ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. హర్రర్ జోనర్ లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీ రిలీజ్ పై పూర్తిగా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్యం పూర్వం జరిగే ఒక యాక్షన్-డ్రామా ఇది. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండేలా హను ఈ మూవీని డిజైన్ చేశాడని సమాచారం. రిలీజ్ ఎప్పుడంటే.. ఏప్రిల్ 3న లాక్ చేసారని సమాచారం. అయితే.. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతే ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల పైనే ఉంది. Prabhas Fauji Release Date.
స్పిరిట్ సినిమా స్టార్ట్ చేయాలని సందీప్ రెడ్డి వంగ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసే వరకు వేరే షూటింగ్ చేయద్దు అనే కండీషన్ పెట్టాడట సందీప్ రెడ్డి వంగ. అందుకనే ఈ సినిమా పట్టాలెక్కడం ఆలస్యం అవుతుందని తెలిసింది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి స్పిరిట్ స్టార్ట్ అవ్వడం ఖాయమని సందీప్ ఇటీవల కింగ్ డమ్ ప్రమోషన్స్ లో చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మరి.. రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
Also Read: https://mega9tv.com/cinema/changes-in-upcoming-movies-sankranti-2026/