ప్యారడైజ్ లుక్ తో అంచనాలు పెంచేసిన నాని!

Spread the love

The Paradise First Look: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. వీరిద్దిరి కాంబోలో దసరా మూవీ రూపొందడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబోలో మూవీ వస్తుండడంతో ప్యారడైజ్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఈ సినిమా నుంచి రెండు లుక్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్స్ అయితే.. వేరే లెవల్లో ఉండడంతో పాటు నాని క్యారెక్టర్ పై హాట్ టాపిక్ గా నిలిచింది. ఇంతకీ.. హాట్ టాపిక్ అవ్వడానికి కారణం ఏంటి..?

ఈ మూవీ నుంచి ఒకటి కాదు ఏకంగా రెండు ఫస్ట్ లుక్స్ విడుదల చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. అయితే.. రెండు జెడలను ముందుకు వేలాడదీసుకుని వెరైటీ లుక్ తో ఓదెల చూపించిన శాంపిల్ ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చింది. ఇప్పుడిదే సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంత వరకు టాలీవుడ్ లో ఏ హీరో చేయని పాత్రను చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఆ క్యారెక్టర్ ఏంటి అనేది తెలిసిన తర్వాత ఆడియన్స్ షాక్ అవ్వడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. ఇటీవల షూటింగ్స్ బంద్ అవ్వడం వలన ఆగింది కానీ.. లేకపోతే షూటింగ్ జరుగుతూనే ఉండేది. రిలీజ్ విషయానికి వస్తే.. మార్చి 26న ప్యారడైజ్ రిలీజ్ అని ప్రకటించాడు. ఇప్పుడు సినిమా జరుగుతుండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం అనేది ఓ ట్రెండ్ గా మారింది. పైగా మారిన జనాల అభిరుచికి తగ్గట్టుగా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అంతలా ప్రమోట్ చేయక తప్పదు. అందుకనే శ్రీకాంత్ ఓదెల ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. The Paradise First Look.

మార్చి 27న రామ్ చరణ్‌ పెద్ది సినిమా రిలీజ్ కానుంది. మార్చి 26న ప్యారడైజ్ రిలీజ్ కానుంది. కాకతాళీయంగా రెండు సినిమాల దర్శకులకు ఇది ద్వితీయ ప్రయత్నం కావడం విశేషం. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ ఘనంగా కెరీర్ ప్రారంభించిన వాళ్ళే. బ్లాక్ బస్టర్ సాధించిన వాళ్లే. ఇప్పుడు రెండో ప్రయత్నం భారీగా ప్లాన్ చేసారు. అక్టోబర్ నుంచి ఈ రెండు సినిమాల మేకర్స్ మరింతగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం. మరి.. నాని ప్యారడైజ్ గట్టి పోటీ తట్టుకుని ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/prabhas-latest-movie-fauji-will-be-released-on-april-3rd/