పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘ది రాజాసాబ్’కు కలెక్షన్ల పరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ఈ నెల 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓపెనింగ్ డే ప్రీమియర్లతో కలిపి రూ.100 కోట్లు దాటేసింది. మొదటి వీకెండ్ లోపల ఇండియాలో రూ.100+ కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.150-160 కోట్లు దాటాయి. నాలుగు రోజుల్లో రూ.200 కోట్లు దాటింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్ క్రేజ్‌కు తోడు మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ తోడవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరి ప్రభాస్ సత్తాను మరోసారి చాటిచెప్పింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనితో అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన సినిమాల జాబితాలో ‘ది రాజాసాబ్’ కూడా చేరిపోయింది. ఓపెనింగ్స్ పరంగా చూస్తే, ప్రీమియర్ షోలతో కలిపే ఈ సినిమా మొదటి రోజే రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. ప్రభాస్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ లభించాయి.