
Raasi Khanna Interview:ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా “తెలుసు కదా” చిత్రాన్ని నిర్మించారు.సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ అలాగే మేకింగ్ వీడియోస్ టిల్లు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.ఈ దీపావళికి అక్టోబర్ 17 న తెలుగు ప్రేక్షకులను ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డ ఫ్యాన్స్ ని అలరించడానికి మూవీ టీం రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను ఫుల్ జోష్ తో స్టార్ట్ చేసారు. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా విలేకరులతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రాశి ఖన్నా మాట్లాడుతూ..”ఇప్పటి వరకు నేను ఇలాంటి రోల్ చేయలేదు, చూడలేదు కూడా.ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కరూ లవ్ అలానే లవ్ లో ఉండే బౌండరీస్ గురించి తెలుసుకుంటారు.నీరజా కోన చాలా లేయర్స్ తో కథ ను రాసుకుంది.చాలా మందికి తెలియదు..సిద్ధూ సెట్స్ లో చాలా సీరియస్ గా ఉంటారు.వర్క్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు సిద్ధూ.నీరజా లో స్టైలిస్ట్ ను చూసాను కానీ డైరెక్టర్ యాంగిల్ కూడా ఉందా అని ఈ సినిమా చేసిన తరువాత తెలిసింది.నేను కూడా ఫస్ట్ టైమ్ ఫీమేల్ డైరెక్టర్ తో చేశాను.అందరు నన్ను చాలా డిసిప్లిన్ గా వుంటాను అంటారు. నేను డిసిప్లిన్ గా ఉంటాను వర్క్ విషయాలలో మాత్రమే కానీ బయట నేను చాలా సరదాగా ఉంటాను.
శ్రీనిధి శెట్టి చాలా సరదాగా ఉంటుంది.తెలుసు కదా క్యూట్ లవ్ స్టోరీ అయితే కాదు…చాలా డిఫరెంట్ స్టోరీ..నేను ఈ సినిమాలో చేసిన అంజలి క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.నేను ఏ ఇండస్ట్రీలో అయినా వర్క్ చేయడానికి ఇష్టపడతాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నాకు అస్సలు నమ్మకం లేదు.ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ ను చూపించే ప్రయత్నం చేసాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.హాయిగా నవ్వుకుంటారు అలానే ఒక కొత్త విషయాన్నీ నేర్చుకుని బయటకి వస్తారు.Raasi Khanna Interview
నాకు హరీష్ శంకర్ గారు కాల్ చేసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అనగానే వెంటనే కథ గురించి కూడా అడగకుండా ఒప్పుకున్నాను.. ఎందుకంటే ఇండస్ట్రీ లో చాలా మంది ఆయనతో వర్క్ చేయాలి అనుకుంటారు. అలాంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఒక కల.పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.నేను షారూఖ్ ఖాన్ తరువాత అంతగా ఎక్సైట్ అయింది కళ్యాణ్ గారితో వర్క్ చేసినప్పుడు.నేను ఊహలు గుస గుసలాడే సినిమా చేస్తున్నప్పుడు… డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వస్తుంది అని షూటింగ్ కూడా ఆపేశారు చూడటానికి.అప్పుడు అర్ధం అయింది పవనిజం అంటే ఏంటి అని.ఆయనికి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్వరికీ లేదు.ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను..” అంటూ తెలిపారు.