నవీన్ యాదవ్ కు తలసాని మద్దతు..?

Spread the love

Talasani and Naveen Yadav: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచార బరిలోకి సైతం దిగిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రికి జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపక్షంలో ఉంటే.. అతని ఇంటి అల్లుడు అధికార పార్టీ నుంచి పోటీ చేయ్యడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అతను ఎవరో కాదు.. సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మరీ తలసాని సపోర్ట్ ఎవ్వరికి ..? ఇంటి అల్లుడికా..? లేక బీఆర్ఎస్ అభ్యర్థికా..?

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికారపార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. గులాబీ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ఖరారు చేయ్యగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ను ఏఐసీసీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ చర్చ తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరి బంధువు. స్వయంగా తలసాని సోదరుడు శ్రీనివాస్ అల్లుడే ఈ నవీన్ యాదవ్. దీంతో ఇప్పుడు తలసాని సొంత పార్టీ బీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేయ్యాల్సి ఉండగా.. అల్లుడు నవీన్ యాదవ్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే తలసాని సొంత పార్టీ అభ్యర్థి వైపు నిలుస్తారా..? లేక బంధుత్వం పేరుతో కాంగ్రెస్ అభ్యర్థికి లోకపాయికరంగా మద్దతు తెలుపుతారా..? అనేది చర్చనీంశంగా మారింది.

జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, తలసానికి మధ్య మంచి అనుబంధం ఉండేది. ముందు నుంచి మాగంటి కుటుంబానికి తలసాని మద్దతుగా ఉంటూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించనప్పటి నుంచి ఆమెకు మద్దతుగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక టికెట్ ను నవీన్ కు ఇవ్వడంతో.. ఇక్కడ రాజకీయం మరింత వేడేక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తలసాని సోదరుడి అల్లుడు. అంటే.. స్వయన సోదరుడి అల్లుడన్నమాట. మరీ ఇప్పుడు ఆయన సపోర్ట్ ఎవ్వరికన్న ప్రశ్న గట్టిగా వినిస్తోంది. ఎందుకంటే.. నవీన్ యాదవ్ కు మొదటి నుంచి తాను రాజకీయంగా సలహాలు ఇస్తూ వచ్చే వాడినని స్వయంగా తలసానే చెబుతున్నారు. మరీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రచారం లో భాగంగా.. నిజంగానే మాగంటి సునీత కు మద్దతిస్తే.. ఇంటి అల్లుడిని విమర్శించాల్సిన పరిస్థితి అందుకే నవీన్ యాదవ్ ను తలసాని ఏం చేయ్యబోతున్నదానిపై మరింత ఉత్కంఠం రేపుతోంది. Talasani and Naveen Yadav.

అయితే రాజకీయాలు వేరు బంధుత్వం వేరు. తలసాని కూడా ఇదే చెబుతున్నారంట. తనకు నవీన్ తో ఉన్న బంధుత్వం వేరు.. బీఆర్ ఎస్ ఉన్న అనుబంధం వేరని ఆయన తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. అలాంటప్పుడు కాంగ్రెస్ కు ఎలా మద్దతు ఇస్తానని తలసాని ప్రశ్నిస్తున్నారంట. నవీన్ తో బంధుత్వం నిజమే. గతంలో ఆయన రాజకీయ సలహాలు కూడా ఇచ్చాను. అయితే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తలసాని శ్రీనివాస్ క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఎంత కాదన్న తనకు నవీన్ యాదవ్ అల్లుడు కాబట్టి.. కొంతైన మద్దతు ఉంటుందని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎది ఏమైనా.. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇబ్బందికరంగా మారిందనడంలో ఏలాంటి సందేహం లేదు. మరీ ఎన్నికల పూర్తయ్యే లోపు తలసాని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.