నాగ్ పై కోపంగా ఉన్నరజినీ ఫ్యాన్స్!

Spread the love

Rajinikanth and Nagarjuna Coolie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున.. వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న క్రేజీ మూవీ కూలీ. ఈ సినిమాలో వీరిద్దరే కాకుండా.. కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు. కీలక పాత్రలో శృతి హాసన్ నటిస్తే.. పూజా హేగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఆగష్టు 14న కూలీ భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. రజినీ ఫ్యాన్స్ నాగ్ పై కోపంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అదేంటి.. ఫస్ట్ టైమ్ రజినీ కోసం నాగ్ విలన్ నటించారు.. అలాంటిది రజినీ ఫ్యాన్స్ నాగ్ పై కోపంగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

నాగార్జున 100వ సినిమా దగ్గరకు వచ్చేసారు. నలభై సంవత్సరాలుగా విభిన్న పాత్రలు పోషిస్తూనే ఉన్నారు.. ఆడియన్స్ ని ఆకట్టుకుంటూనే ఉన్నాడు. అయితే.. ఇన్నాళ్లుగా హీరోగా నటించడం వలన బోర్ కొట్టిందో.. లేక కొత్తగా ట్రై చేయాలి అనుకున్నారో ఏమో కానీ.. కూలీ మూవీలో విలన్ గా నటించారు. వయసు అరవై దాటిపోయింది.. కెరీర్ నలభై ఏళ్లు దాటేస్తుంది.. ఇంకా అమ్మాయిల వెంటపడడం.. రొమాన్స్ చేయడం చూపిస్తే బాగోదని.. తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే కూలీలో విలన్ గా నటించేందుకు సై అన్నారు.

కూలీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటానని నాగార్జున చెప్పారు. కుబేర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున బయటపెట్టారు. ఇక అక్కడ నుంచి కూలీ పై మరింత క్రేజ్ పెరిగింది. కూలీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టారు నాగ్. ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో తనకు సీన్స్ లేవని.. అమీర్ ఖాన్ లాస్ట్ లో వస్తారని.. ఆయన క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని లీక్ చేశారు. ఇలా నాగ్ కూలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ లీక్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో రజనీ ఫ్యాన్స్.. అలా చెప్పేయద్దు సార్ అంటూ నాగ్ పై కాస్త కోపంగా.. కాస్త స్వీట్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు. Rajinikanth and Nagarjuna Coolie.

నాగార్జున కూలీ సినిమాలో నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి విలన్ క్యారెక్టరా..? స్పెషల్ క్యారెక్టరా..? అనేది సస్పెన్స్ గా ఉండేది. కూలీ మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సినిమాలోనే చూసి ఆడియన్స్ సర్ ఫ్రైజ్ అవ్వాలి అనుకున్నారట లోకేష్ కనకరాజ్. అయితే.. నాగ్ సడన్ గా లీక్ చేసేసారు. ఈ సినిమా తర్వాత నాగ్ ను చూసే విధానం మారిపోతుందని.. ఆయన కోసం ప్రత్యేకంగా స్పెషల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. ఆగష్టు 14న రానున్న కూలీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో.. నాగ్ కు ఎలాంటి పేరు తీసుకువస్తుందో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/naga-chaitanya-sign-up-with-mithran-the-official-announcement-will-be-after-sardar-2-release/