ఘట్టమనేని కుటుంబం నుండి వస్తున్న మరొక నటుడు జయకృష్ణ. ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడే జయకృష్ణ. ఇక ఆయన హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీలో హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రషా థడానీ నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఆజాద్ మూవీతో తెరంగ్రేటం చేశారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్ విడుదలైంది. మంగ అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు. బలమైన, నటనకు ఆస్కారమున్న అద్భుత పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది.రియాలిటీకి పెద్ద పీట వేస్తూ అత్యద్భుతమైన భావోద్వేగాలున్న కథాంశంతో రూపొందుతున్నట్లు తెలిపారు. ఇక ఇదివరకు ‘RX 100’, మంగళవారం వంటి చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన దర్శకుడు కావడంతో ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సి.అశ్వనీ దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.