సంక్రాంతి పండుగ సినిమాలకు అత్యంత ముఖ్యమైన సీజన్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి మరింత జోరుగా ఉంటుంది. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలిచిన రెండు భారీ చిత్రాలు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, సీనియర్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలకు తాజాగా తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంచుకునేందుకు నిర్మాతలు చేసుకున్న వినతిని పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ‘ది రాజాసాబ్’ జనవరి 9న, చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12న విడుదలవనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల కోసం నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని, హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ప్రస్తుతం నిర్మాతలకు ఊరట లభించినట్లైంది.