సత్యవతి గా రీతూ వర్మ…ఆకట్టుకుంటున్న న్యూ లుక్

Spread the love

తెలుగు సినీ ఇండస్ట్రీలో  మాచో స్టార్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ ప్రస్తుతం ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రముఖ నటి రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఫస్ట్ లుక్‌లో రీతూ వర్మ పూర్తిగా ఒక యోధురాలిగా కనిపిస్తున్నారు. ఆమె సత్యవతి అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పోస్టర్‌లో రీతూ వర్మ ఒక గుహ లో అది కూడా చేతిలో బాణం పట్టుకుని ఉండడం చాల బాగుంది. ఈ సినిమాలో రీతూ వర్మ పోషిస్తున్న సత్యవతి పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. సత్యవతి పాత్ర ధైర్యం, నిబద్ధత, ఆత్మగౌరవం వంటి లక్షణాలతో నిండిన మహిళగా కనిపించబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రీతూ వర్మ ఎక్కువగా సాఫ్ట్ ఇంకా ఎమోషనల్ పాత్రలలో కనిపించారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆమె పూర్తిగా ఒక యాక్షన్ బలమైన పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ఒక కొత్త కోణాన్ని చూపించే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు హీరో గోపీచంద్ కూడా ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఆయన పాత్ర కూడా కథలో చాలా క్లిష్టమైన సవాళ్లతో కూడినదిగా ఉండబోతుందని తెలుస్తోంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి తన నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీని సౌందర్ రాజన్, సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *