గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ తదితరులు కార్యక్రమానికి హాజరైయ్యారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్ పీరియన్స్ జోన్ ను సీఎం పరిశీలించారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 600 ఎకరాల కేటాయించింది.