స్వామి మాలలో పార్టీకి చరణ్..విమర్శలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన శిరీష్  

Spread the love

అల్లువారి చిన్నబ్బాయి  శిరీష్ పెళ్లి మార్చ్ 6న జరగనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా శిరీష్ పెళ్లి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు శుభలేఖలు పంచుతుండగా, మరోవైపు ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇటీవల అల్లు బ్రదర్స్ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల కోసం ఒక గ్రాండ్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొనడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ప్రతి సంవత్సరం ఈ కాలంలో చరణ్ స్వామి మాల ధరిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఆయన మాలలోనే ఉన్నారు. అలాంటి సమయంలో పార్టీకి హాజరవడం సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలకు దారి తీసింది. “స్వామి మాల వేసుకుని పార్టీకి ఎలా వచ్చారు?” అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెటిజన్ “చరణ్ స్వామి” అంటూ కామెంట్ చేయడంతో, అల్లు శిరీష్ వెంటనే స్పందించారు. చరణ్ గారి మీద ఎలాంటి అపార్థం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. “మాలలో ఉన్న చరణ్ అన్నయ్య పార్టీకి వచ్చారు. మా అందరిని ఆశీర్వదించి, విష్ చేసి వెంటనే వెళ్లిపోయారు. ఆయన ఉన్న సమయంలో ఎవరూ మద్యం తాగలేదు. స్వామిపై ఆయనకు ఉన్న భక్తి, నిబద్ధత చాలా గొప్పది” అని శిరీష్ స్పష్టం చేశారు. శిరీష్ ఇచ్చిన ఈ వివరణతో సోషల్ మీడియాలో ఉన్న అనుమానాలు వెంటనే తగ్గిపోయాయి. ముఖ్యంగా మెగా, అల్లు అభిమానులు శిరీష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చరణ్ గారి భక్తిని గౌరవిస్తూ, ఎలాంటి అపవాదు రాకుండా జాగ్రత్తపడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇది ఇరు కుటుంబాల మధ్య ఉన్న బంధం ఎంత గాఢమో మరోసారి నిరూపించింది. మెగా – అల్లు కుటుంబాల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందా? సంబంధాలు మునుపటిలా లేవా? అనే అనుమానాలు అభిమానుల మధ్య తరచుగా వినిపిస్తాయి. కానీ నిజానికి సినిమా విషయాలు ఎలా ఉన్నా, కుటుంబ విషయాలకు వస్తే మాత్రం ఇరు కుటుంబాల సభ్యులు ఎంతో ఆప్యాయంగా, అన్యోన్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో కలిసి కనిపిస్తూ ఆ బంధం ఎంత బలంగా ఉందో చూపిస్తూనే ఉంటారు.

ఇక శిరీష్ పెళ్లి విషయానికి వస్తే కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన నయనికతో శిరీష్ మార్చి 6న హైదరాబాద్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు అత్యంత ఆత్మీయంగా, ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానులు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *