నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాదు… దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. ‘దసరా’తో మాస్ ఇమేజ్ సంపాదించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాత్ర పేరు శికంజ మాలిక్… ఇంకా ఈ సినిమాలో అయన రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆగస్ట్ 21న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇంకా ఈ సినిమా ఒక్క తెలుగు లోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీతో పాటు మొత్తం 8 భాషల్లో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఇండిపెండెన్స్ డే సందర్బంగా 2026లో రానున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న చిత్రంగా ‘ది ప్యారడైజ్’ పేరు వినిపిస్తోంది. అందుకే నాని కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని సరసన హీరోయిన్‌గా సోనాలి కులకర్ణి నటిస్తోంది. రాఘవ్ జుయల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ నవీన్ నూలీ, తోట శ్రీనివాస్ డైలాగులు రాస్తున్నారు.
ఈ సినిమాలో నానిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా చూపిస్తున్నారు దర్శకుడు. రెండు జడలు ముందుకు వేసుకుని, డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్న నాని లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతలో ఈ స్టైల్ ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదలైన “ఆయా షేర్” పాటతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. మాస్ స్టెప్పులతో నాని చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుధ్ కలిసి ఆలపించారు. యూట్యూబ్‌లో ఈ సాంగ్ మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా… ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ చర్చ నడుస్తోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిందీ బెల్ట్, ఓవర్సీస్ మార్కెట్‌లలో డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ ఆఫర్లతో ముందుకు వస్తున్నారని సమాచారం. అయితే నిర్మాతలు తొందరపడకుండా సరైన సమయంలో డీల్ క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. “ది ప్యారడైజ్”తో నాని మరో కొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ భారీస్థాయిలో నిలుస్తుందని నాని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.