హెచ్.పీ.వీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన ప్రధాని మోడీ

Spread the love

దేశవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో పాటు నివారించదగిన పలు రకాల క్యాన్సర్లను అరికట్టడమే టార్గెట్ గా హెచ్.పీ.వీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. నేడు రాజస్థాన్ లోని అజ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు.  ఇక ఈ  వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు ‘గార్దాసిల్’ అనే వ్యాక్సిన్ ను హెల్త్ సెంటర్స్ లో ఫ్రీగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్.పీ.వీ టైప్ 16, 18తో పాటు టైప్ 6,11 వేరియంట్ల నుండి ప్రొటెక్షన్ కల్పించనుంది.  ప్రతి ఏటా సుమారు కోటి మందికి పైగా బాలికలకు ఈ వ్యాక్సిన్  వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యాక్సిన్ అన్ని గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్  (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు) లో ఉచితంగా లభిస్తుంది. ప్రైవేట్ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్ ధర వేలల్లో ఉండగా, ప్రభుత్వం దీనిని సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *