పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదని సాయి పల్లవి స్పష్టం చేశారు. తన కెరీర్ చాలా కీలక దశలో ఉందని పేర్కొన్నారు. సినీ ప్రపంచంలో తన సహజమైన నటనతో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై ఆమె స్వయంగా స్పందించి స్పష్టతనిచ్చింది. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకుఫుల్ స్టాప్ పెడుతూ ఆమె తన స్పందనను తెలిపింది. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా మీడియా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించింది.ప్రస్తుతం నేను పూర్తిగా నా సినిమాల పనులతోనే బిజీగా ఉన్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. అంతేకాదు, తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని కూడా వెల్లడించింది. దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పెళ్లి రూమర్లకు ఆమె ఒక్క మాటతో చెక్ పెట్టినట్లైంది. కొద్ది రోజులుగా సాయి పల్లవి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె చెల్లెలి పెళ్లి ఇటీవల జరగడంతో ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించాయి. అభిమానులు, నెటిజన్లు ఈ విషయంపై ఊహాగానాలు చేస్తూ వివిధ రకాల పోస్టులు కూడా పెట్టారు. అయితే ఆ ఊహాగానాలన్నింటికీ ఇప్పుడు సాయి పల్లవి స్వయంగా సమాధానం ఇచ్చింది. ఇక ఆమె పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మైథలాజికల్ సినిమా ‘రామాయణ’లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ‘Ek Din’ అనే సినిమాలో ఆమె నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.