సినిమా ప్రపంచంలో స్టార్ కిడ్స్ గా అడుగుపెట్టినప్పటికీ మంది తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలంటే తప్పకుండా తమని తాము నిరూపించుకోవాల్సిందే. కొందరు పెద్దగా రాణించలేక కనుమరుగవుతారు. కొందరు మాత్రం తమ ప్రతిభతో, కష్టపాటుతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదిస్తారు. అలాంటి వారిలో శృతి హాసన్, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ ముందువరుసలో ఉంటారు. ఇద్దరు స్టార్ కిడ్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూనే, తమకంటూ ప్రత్యేకమైన ప్రయాణాన్ని నిర్మించుకున్నారు. ఈ ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచే ఒక అందమైన స్నేహం ఉందన్న విషయం ఇప్పుడు అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. శృతి హాసన్, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ చిన్నప్పట్లో చెన్నైలో చదువుకున్నప్పుడు ఒకే స్కూల్‌కు వెళ్లేవారట. అయితే వారు ఒకే క్లాస్‌లో చదివారా అనే విషయం కంటే కూడా, చిన్నతనంలోనే వారిద్దరి మధ్య ఏర్పడిన సరదా స్నేహం ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తో ఉన్న స్నేహం గురించి మాట్లాడుతూ, ఆ రోజులు ఇప్పటికీ తనకు ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా ఉన్నాయని చెప్పారు. చెన్నైలోని రెండు ప్రముఖ పాఠశాలల్లో తాము చదివామని, అప్పట్లో తాము స్టార్ కిడ్స్ అన్న భావన అసలు తమకు ఉండేదే కాదని చెప్పారు. మేము చదివినప్పుడు ఎవ్వరూ మమ్మల్ని పెద్ద స్టార్ల పిల్లలుగా చూడలేదు. మేము కూడా ఆ విధంగా ఆలోచించలేదు. మేము కూడా మిగతా పిల్లల్లాగే స్కూల్‌కు వెళ్లి, ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ, సరదాగా గడిపే పిల్లలమేనని శృతి గుర్తుచేసుకున్నారు. స్టార్ కిడ్స్‌గా ఉండటం వల్ల ఎలాంటి ప్రత్యేకతలూ తమ జీవితంలో కనిపించలేదని ఆమె నవ్వుతూ చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. అయితే ఈ ఇంటర్వ్యూలో శృతి చెప్పిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్లో జరిగిన ఒక ఫంక్షన్లో తాను ఒక పాట పాడిన విషయం గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఆ పాట పేరు సోంబి. ఆ రోజున స్టేజ్‌పై నిలబడి ఎంతో ఉత్సాహంగా ఆ పాటను పాడిన తర్వాత, దుల్కర్ సల్మాన్ తనను సరదాగా సోంబి అని పిలవడం మొదలుపెట్టాడట. ఆ రోజున మొదలైన ఆ సరదా పేరు తర్వాత చాలా కాలం పాటు కొనసాగిందని శృతి చెప్పారు. స్కూల్లో దుల్కర్ ఎప్పుడూ నన్ను ‘సోంబి’ అని పిలిచేవాడు. ఆ పాట విన్న తర్వాత అతనికి నేను శృతి కాదు, ‘సోంబి’గానే కనిపించేదాన్ని. నిజం చెప్పాలంటే మా స్కూల్లో చాలా మంది పిల్లలకు నా అసలు పేరు కూడా తెలియదు. వాళ్లు నన్ను ‘కమల్ హాసన్ కూతురు’గా మాత్రమే గుర్తుంచుకునేవారు” అని ఆమె నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.