మహేష్‌ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా?

Spread the love

Super Star Mahesh Babu Birthday Special: సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా అంచనాలకు మించి ఉండేలా జక్కన్న తీస్తున్నారు. 1000 కోట్లు ఈ సినిమా బడ్జెట్ అంటే.. ఈ మూవీ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ పాన్ వరల్డ్ మూవీ తర్వాత మహేష్‌ బాబు సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు కానీ.. ఓ భారీ నిర్మాణ సంస్థ బిగ్ ఆఫర్ ఇచ్చిందనే వార్త లీకైంది. ఇంతకీ.. ఆ నిర్మాణ సంస్థ ఏంటి..? డైఎరక్టర్ ఎవరు..? ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది..?

మహేష్‌ బాబుకు బిగ్ ఆఫర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. మహేష్‌ బాబుతో ఈ నిర్మాణ సంస్థ శ్రీమంతుడు అనే సినిమాను నిర్మించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత ఈ నిర్మాణ సంస్థ ఇండియాలోనే భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాలని ట్రై చేస్తుంది. దీని కోసం భారీ ఆఫర్ చేసిన మాట వాస్తవమే కానీ.. మహేష్‌ బాబు మాత్రం ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదని తెలిసింది. ప్రస్తుతం మహేష్‌ బాబు ఫోకస్ అంతా జక్కన్నతో చేస్తున్న సినిమా పైనే ఉంది.

ఇక ఈ వార్త లీకైనప్పటి నంచి దీనికి దర్శకుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ అయితే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. వీరిద్దరే కాకుండా టాలీవుడ్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్స్ తో కూడా చర్చలు జరిపినట్టుగా టాక్ వినిపిస్తోంది. సుకుమార్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే అనే సినిమా తీయడం తెలిసిందే. అయితే.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మహేష్‌ బాబుతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ చేస్తానని సుకుమార్ గతంలో చెప్పడం జరిగింది. అందుచేత సుకుమార్ కూడా మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. Super Star Mahesh Babu Birthday Special.

ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది..? ఎప్పుడు పట్టాలెక్కచ్చు అంటే.. 2027లో మహేష్‌, రాజమౌళి మూవీ రిలీజ్ అని వార్తలు వస్తున్నాయి. అందుచేత మహేష్‌ నెక్ట్స్ మూవీని 2027లో రాజమౌళితో చేస్తున్న మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కొత్త సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు..? ఏ జోనర్ లో సినిమా చేస్తారు… ఇలా పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: https://mega9tv.com/cinema/the-paradise-raises-expectations-with-first-look-paradise-releases-on-march-26th/