ప్రభాస్ సినిమాల సీక్వెల్స్ విషయంలో నిన్నటి వరకూ ఉన్న అనుమానాలు, సందేహాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతున్నాయి. ఒకప్పుడు ఈ సినిమా కి “సీక్వెల్ ఉంటుందా? లేదా?” అనే ప్రశ్నలు వినిపిస్తే, ఇప్పుడు మేకర్స్ మాత్రం తమ మాట మీద నిలబడి, వెనక్కి తగ్గే ఆలోచనే లేదని స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నారు. ఒకసారి చెప్పిన మాటను నిలబెట్టుకోవడంలో ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దేవర, కల్కి, ఖైదీ, విక్రమ్ వంటి సినిమాలు తమ సీక్వెల్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ లిస్ట్‌లో తాజాగా మరో భారీ చిత్రం చేరింది… అదే సలార్. ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘సలార్: శౌర్యాంగ పర్వం’ పై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనుకడుగు వేయడం లేదని మేకర్స్ ఇచ్చిన సంకేతాలు, డార్లింగ్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.ఈ గుడ్ న్యూస్ వెనుక ముఖ్యంగా శృతి హాసన్ పాత్ర ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ చేసిన చిన్న బర్త్‌డే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “త్వరలోనే శౌర్యాంగ పర్వం సెట్లో కలుద్దాం” అనే మాట, సలార్ సీక్వెల్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఒక్క లైన్‌తోనే మేకర్స్ తమ కమిట్మెంట్ను మరోసారి రుజువు చేశారు.ప్రస్తుతం సినిమాలలో సీక్వెల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కథను ఒకే సినిమాతో ముగించకుండా, పెద్ద వరల్డ్ బిల్డింగ్‌తో కొనసాగించే ట్రెండ్ ఇప్పుడు బలంగా కొనసాగుతోంది. ఒకవైపు కల్కి పార్ట్-2 , మరోవైపు సలార్ శౌర్యాంగ పర్వం అప్డేట్… ఈ రెండు వార్తలు కలిసి డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌లా మారాయి.