తమిళ అగ్రనటుడు దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.అయితే దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని ఒక పక్కా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా మలుస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణానికి నాంది పలుకుతున్న సమయంలో వస్తున్న ఈ సినిమా కావడంతో, ఇందులో ఉండే డైలాగులు, సన్నివేశాలు సందేశాత్మకంగా ఉండనున్నాయని సమాచారం.ఈ మూవీలో విజయ్ కి జోడిగా పూజా హెడ్గే నటించగా, మామితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది.ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా, చిత్ర బృందం తాజాగా ఒక కీలక అప్డేట్ ఇచ్చింది.నిజానికి ట్రైలర్ జనవరి 2న వస్తుందని భావించినప్పటికీ, తాజా అధికారిక సమాచారం ప్రకారం జనవరి 3, 2026 (శనివారం) సాయంత్రం 6:45 గంటలకు తమిళం, తెలుగు & హిందీ భాషల్లో ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయగా, అనిరుధ్ అందించిన పాటలు యూట్యూబ్లో రికార్డులను తిరగరాస్తున్నాయి.