తనదైన నటనతో పలు రకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు కీర్తి సురేష్. తాజాగా ఆమె పెళ్లి సంగతులను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 2024లో ఆమె ఆంటోని తటిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘15 ఏళ్లు ప్రేమలో ఉన్నాం. పెళ్లి అలా వైభవంగా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. కచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామనే అనుకున్నాను. ఇంట్లో అంగీకరించడంతో ఘనంగా జరిగింది. దీంతో కల నిజమైనట్లు అనిపించింది. అందుకే మా వివాహ వేడుకలో నేను భావోద్వేగానికి గురయ్యాను. ఒక్క క్షణం నోట మాట రాలేదు. 15 ఏళ్ల ప్రేమ 30 సెకన్లలో తాళి కట్టే సమయంలో కళ్ల ముందు కదలాడింది. దీంతో ఆనందభాష్పాలు ఆగలేదు. ఆంటోనీ కూడా నమ్మలేకపోయాడు. అందుకే అతడు కూడా ఎమోషనల్ అయ్యాడు. మొదటిసారి ఆంటోనీ కళ్లల్లో నీళ్లు చూశాను. ఇది ఒక అందమైన ప్రయాణమని చాల ఆనందంగా చెప్పింది కీర్తి. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే , తను తెలుగు లో విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్దన్ సినిమా లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ స్టేజి లో ఉంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.