‘ది ఫ్యామిలీ మ్యాన్’ భారతదేశ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ లలో ఈ పేరు ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇండియన్ స్పై థ్రిల్లర్స్ రంగాన్నిమరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన ఈ వెబ్ సిరీస్, కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఉత్కంఠను రేపే సన్నివేశాలు, అద్భుతమైన కథాకథనాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని వెబ్ సిరీస్ లలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ గా నిలిచింది. సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ దేశ సరిహద్దులు దాటి విస్తరించే రహస్య శత్రువుల నుండి భారత్ ను కాపాడే ఒక ఇంటెలిజెంట్ ఏజెంట్ కథగా ప్రతి ఒక్కరినీ అలరించింది ఈ సిరీస్. రాజ్ & డికే దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ సిరీస్ లో ‘శ్రీకాంత్ తివారి’ పాత్రలో మనోజ్ బాజ్‌పాయీ విజృంభించారు. కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్, క్యాస్టింగ్ కూడా ఈ సిరీస్ కు మరో ప్రధాన బలం. షరీబ్ హష్మీ ప్రియమణి, ఆశ్లేష ఠాకూర్, శ్రేయాస్ ధన్వంతరి, వేదాంత్ సిన్హా తదితరులు తమ తమ పాత్రలతో అలరించారు. ఒక్కో సీజన్ ఒక్కో రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. మొదటి సీజన్ పాకిస్తాన్ ఉగ్రవాద మూలాల నేపథ్యంతో దేశ రాజధానిని రక్షించే నేపథ్యంలో సాగితే, రెండవ సీజన్‌లో తమిళనాడు నేపథ్యం, సమంత పాత్ర నటన, మరియు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ సిరీస్ స్థాయిని మరింత పెంచేశాయి. ఇక మూడవ సీజన్ ఈశాన్య భారతదేశం, చైనా సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ కుట్రల చుట్టూ తిరుగుతూ సస్పెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టెక్నీకల్ గా కూడా వన్-టేక్ యాక్షన్ షాట్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సూపర్ స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌ను ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే ఒక బెంచ్‌మార్క్ గా చూపాయి. ఇక తాజాగా చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు నాలుగో సీజన్ కు సన్నాహాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మనోజ్ తన రాబోయే చిత్రం ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాజాగా తెలిపారు. “ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ నాలుగో సీజన్ చర్చలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది ఇంత గొప్ప ఫ్రాంచైజీగా మారడం అందరినీ ఆకట్టుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇక నాలుగో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.