రెబెల్ స్టార్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.ఈ చిత్రంలో నటి రిద్ధి కుమార్ పోషిస్తున్న ‘అనిత’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా విడుదల చేసింది. “సహజంగానే ఆకర్షించే వ్యక్తిత్వం ఆమెది” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.ఇప్పటికే ప్రభాస్ తన వింటేజ్ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేయగా, ఇప్పుడు అనిత పాత్రతో సినిమాలోని గ్లామర్ , ఇంటెన్సిటీ మరింత పెరిగింది. ఇందులో సంజయ్ దత్,బోమన్ ఇరానీ , సత్య , సప్తగిరి , జరీనా వాహబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ప్రభాస్ కు జోడిగా మాళవిక మోహన్ , నీధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.మారుతి మార్క్ కామెడీ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్‌గా నిలవనుంది.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.