మహేష్‌ రామాయణంకు నో చెప్పడానికి కారణం..?

Spread the love

Mahesh Said No to Ramayana: సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీని చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బాబు చాలా హోమ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడట. సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంటుంది కానీ.. అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ రామాయణం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి మహేష్ బాబు ఈ సినిమాని రిజెక్ట్ చేసాడనే వార్త వైరల్ అయ్యింది. ఇంతకీ.. రామాయణం మూవీకి మహేష్ నో చెప్పడానికి కారణం ఏంటి..?

బాలీవుడ్ మూవీ దంగల్ దర్శకుడు నితీష్ తివారీ రామాయణం అనే సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన రాముడు క్యారెక్టర్ కోసం మహేష్‌ బాబునే కాంటాక్ట్ చేశారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో.. విజువల్ వండర్ అనేలా రూపొందించే ప్లాన్ మొత్తం చెప్పారట. అయితే.. అంతా విన్న తర్వాత మహేష్‌ బాబు ఈ ప్రాజెక్ట్ కి సున్నితంగా నో చెప్పారట. మహేష్‌ బాబు రామాయణం సినిమాకి నో చెప్పారనే వార్త గతంలో వైరల్ అయ్యింది. ఇప్పుడు అసలు రీజన్ ఏంటి అనేది బయటకు వచ్చింది. మేటర్ ఏంటంటే.. అప్పటికే మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. డేట్స్ ప్రాబ్లమ్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ మూవీకి నో చెప్పారట. Mahesh Said No to Ramayana.

మహేష్‌ బాబు నో చెప్పడంతో రాముడు పాత్రకు బాలీవుడ్ స్టార్ రణ్‌ బీర్ కపూర్ ను కాంటాక్ట్ చేయడం.. ఆయన ఓకే అనడం జరిగింది. ఇక సీత పాత్రను సాయిపల్లవి పోషిస్తుంటే.. రావణుడు పాత్రను కేజీఎఫ్ స్టార్ యశ్ పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చివరిలో రాముడు పాత్రను చూపించారు. భారీ బడ్జెట్ తో వావ్ అనిపించే విజువల్స్ తో ఈ సినిమా రూపొందుతోందన్న క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో అనుకున్న విధంగా అనుకున్న టైమ్ కి రిలీజ్ చేసేలా నితీష్ తివారి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఇక రామాయణం సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కు 900 కోట్లు.. సెకండ్ పార్ట్ కు 700 కోట్లు.. రెండు పార్టులకు కలిపి 1600 కోట్లు అవుతుందని సమాచారం. దీనికి రెండుసార్లు ఆస్కార్ విన్నింగ్ సంగీత ద‌ర్శ‌కుడు హ‌న్స్ జిమ్మ‌ర్ నేప‌థ్య సంగీతం అందిస్తుండ‌గా, మ‌రో ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహ‌మాన్ పాట‌ల్ని అందిస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ కోసం హాలీవుడ్ సాంకేతిక‌ నిపుణులు ప‌ని చేస్తుండ‌డంతో ఇంత‌టి భారీ బ‌డ్జెట్ ఖ‌ర్చు కానుంది. మొత్తానికి నితీష్ తివారి పెద్ద సాహసమే చేస్తున్నారు. మరి.. రామాయణం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/vijay-devarakonda-feel-tensed-about-his-kingdom-movie-release-which-is-made-with-the-srilankan-background/