మాజీ సీజేఐ చంద్రచూడ్ బంగ్లా వివాదం..!

Spread the love

Chandrachud Delhi CJI Bungalow: మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఇంటి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిటైర్మెంట్ అయ్యి ఎనిమిది నెలలు గడిచినా ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయకపోవడంతో వివాదం రేగింది. ఈ బంగ్లా సిట్టింగ్ సీజేఐ కోసం రిజర్వ్ చేయబడంది. అయినా మాజీ సీజేఐ ఖాళీ చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. అందరికీ న్యాయం చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని చాలా మంది ప్రశ్నించారు. అయితే ఇల్లు ఖాళీ చేయకపోవడానికి ఆయన చెప్పిన కారణం అందరినీ అయ్యే పాపం అనిపిస్తోంది..? అసలు మాజీ సీజేఐ చంద్రచూడ్ ఇల్లును ఎందుకు ఖాళీ చేయలేదు..? ఆయనకొచ్చిన కష్టం ఏంటి..?

మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్, నవంబర్ 2022 నుంచి నవంబర్ 2024 వరకు భారత 50వ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. ఆయన న్యాయ సంస్కరణలు, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, ఆధునికీకరణ కార్యక్రమాలతో గుర్తుండిపోయారు. కానీ, 2024 నవంబర్ 10న రిటైర్ అయిన తర్వాత, ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని సీజేఐ అధికారిక నివాసంను ఖాళీ చేయకపోవడంతో వివాదం తలెత్తింది. ఈ బంగ్లా సుప్రీం కోర్టు జడ్జెస్ రూల్స్ ప్రకారం, సిట్టింగ్ సీజేఐ కోసం రిజర్వ్ చేయబడిన గృహం. ఈ రూల్స్ ప్రకారం, రిటైర్మెంట్ తర్వాత సీజేఐకి ఆరు నెలల గ్రేస్ పీరియడ్ టైప్- VII బంగ్లాలో ఉచితంగా ఉండేందుకు అనుమతి ఉంది, కానీ టైప్ VIII బంగ్లా వెంటనే ఖాళీ చేయాలి. చంద్రచూడ్ ఈ బంగ్లాను ఎనిమిది నెలలకు పైగా ఖాళీ చేయలేదు, దీనివల్ల సుప్రీం కోర్టు అడ్మినిస్ట్రేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు రిజిస్ట్రీ కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసి, ఈ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించి, సుప్రీం కోర్టు హౌసింగ్ పూల్‌కు తిరిగి ఇవ్వాలని కోరింది. ఈ లేఖ అరుదైన చర్య, ఎందుకంటే గతంలో రిటైర్డ్ సీజేఐలు కొన్ని నెలలు అధికారిక బంగ్లాలో ఉండినప్పటికీ, అలా సుప్రీం కోర్టు లేఖ రాయడం చాలా అరుదు. ఈ వివాదం సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కొందరు చంద్రచూడ్‌ను విమర్శిస్తూ, రూల్స్ అందరికీ సమానం అని అంటున్నారు. మరికొందరు, ఆయన కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సమర్థిస్తున్నారు. చంద్రచూడ్ రిటైర్మెంట్ తర్వాత, జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత సీజేఐ భూషణ్ ఆర్. గవాయ్ ఈ బంగ్లాలోకి వెళ్లకుండా, తమ పాత నివాసాల్లోనే ఉన్నారు. దీనివల్ల సుప్రీం కోర్టులో 33 మంది జడ్జిలలో నలుగురికి అధికారిక గృహాలు లేని పరిస్థితి ఏర్పడింది.

ఈ ఆలస్యానికి కారణం ఏంటి? చంద్రచూడ్ ఇంటిని ఖాళీ చేయడంలో ఆలస్యానికి ప్రధాన కారణం ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రియాంక, మహి… అలాగే వారి ప్రత్యేక ఆరోగ్య సమస్యలు. ఈ ఇద్దరూ నెమలైన్ మైయోపతి అనే అరుదైన జన్యుసంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కండరాలను బలహీనపరుస్తుంది, శ్వాస తీసుకోవడం, నడవడం, మాట్లాడటం కష్టతరం చేస్తుంది. ప్రియాంక, మహి రోజూ ఛాతీ, శ్వాసకోశ, నాడీ సంబంధిత చికిత్సలు, నొప్పి నిర్వహణ, స్పీచ్ థెరపీ పొందుతున్నారు. ప్రియాంక గతంలో చండీగఢ్‌లోని PGIలో 44 రోజులు ICUలో ఉంది. ఆమె ట్రాకియోస్టమీ ట్యూబ్‌తో శ్వాస తీసుకుంటోంది, చంద్రచూడ్ కుమార్తెలకు వీల్‌చైర్ సౌకర్యంగా ఉండే ఇల్లు, ధూళి, అలర్జీలు, ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షణ కల్పించే శుభ్రమైన వాతావరణం, ICU-లాంటి సెటప్ అవసరం. ప్రస్తుత కృష్ణ మీనన్ మార్గ్ బంగ్లాలో చంద్రచూడ్ కుటుంబం ఈ సెటప్‌ను ఏర్పాటు చేసుకుంది. AIIMS నిపుణులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లతో కూడిన మల్టీ-డిసిప్లినరీ టీమ్ రోజూ వీరికి చికిత్స అందిస్తోంది. ఈ సెటప్‌ను మరో ఇంటికి మార్చడం సమయం తీసుకునే, సంక్లిష్టమైన ప్రక్రియ. Chandrachud Delhi CJI Bungalow.

చంద్రచూడ్, ఆయన భార్య కల్పనా దాస్ ఫిబ్రవరి 2025 నుంచి తమ కుమార్తెల అవసరాలకు సరిపడే ఇంటిని వెతుకుతున్నారు. ఢిల్లీలో సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హోటళ్లను పరిశీలించారు, కానీ అవి వీల్‌చైర్ సౌకర్యం, శుభ్రత, ఇన్ఫెక్షన్ రహిత వాతావరణం అందించలేదు.ప్రభుత్వం చంద్రచూడ్‌కు తుగ్లక్ రోడ్‌లో బంగ్లా నెం. 14ను కేటాయించింది, కానీ ఈ ఇల్లు రెండేళ్లుగా ఉపయోగంలో లేకపోవడంతో రిపేర్లు అవసరం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల వల్ల ఈ రిపేర్లు ఆలస్యమయ్యాయి. చంద్రచూడ్ ఈ బంగ్లా రిపేర్లు పూర్తయిన వెంటనే 10-14 రోజుల్లో మారతామని, సామాను ప్యాక్ చేసినట్లు చెప్పారు. ఆయన అప్పట్లో జస్టిస్ సంజీవ్ ఖన్నాకు లేఖ రాసి, ఏప్రిల్ 30, 2025 వరకు ఎక్స్‌టెన్షన్ కోరారు, నెలకు రూ. 5,430 లైసెన్స్ ఫీజు చెల్లించారు. మే 31, 2025 వరకు మరో ఎక్స్‌టెన్షన్ ఇవ్వబడినప్పటికీ, సుప్రీం కోర్టు ఇకపై ఎక్స్‌టెన్షన్‌లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. గతంలో జస్టిస్ యూయూ లలిత్, ఎన్వీ రమణ వంటి మాజీ సీజేఐలకు ఇలాంటి ఎక్స్‌టెన్షన్‌లు ఇచ్చిన ఉదాహరణలను చంద్రచూడ్ పేర్కొన్నారు, కానీ సుప్రీం కోర్టు ఈసారి కఠినంగా వ్యవహరిస్తోంది.

సుప్రీం కోర్టు ఈ వివాదంపై కఠిన వైఖరి అవలంబించింది. సుప్రీం కోర్టు రిజిస్ట్రీ కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసి, చంద్రచూడ్ బంగ్లాను ఖాళీ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ లేఖలో, గ్రేస్ పీరియడ్ దాటినా బంగ్లా ఖాళీ కాలేదని, వెంటనే దీనిని సుప్రీం కోర్టు హౌసింగ్ పూల్‌కు తిరిగి ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను సీరియస్‌గా తీసుకుంది. సంబంధిత మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయంపై సుప్రీం కోర్టు అడ్మినిస్ట్రేషన్‌తో చర్చలు జరిపారు. ప్రభుత్వం చంద్రచూడ్‌కు తుగ్లక్ రోడ్‌లో బంగ్లా నెం. 14ను కేటాయించింది, కానీ ఈ ఇల్లు రెండేళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల రిపేర్లు అవసరం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల వల్ల నిర్మాణ పనులపై ఆంక్షలు ఉన్నాయి. దీనివల్ల రిపేర్లు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వం ఈ రిపేర్లను వేగవంతం చేయడానికి ఆదేశాలు జారీ చేసింది, చంద్రచూడ్ ఈ ఇంటికి త్వరలో మారేలా చర్యలు తీసుకుంటోంది. సుప్రీం కోర్టు జడ్జిలలో కొందరు, ముఖ్యంగా కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు, అధికారిక గృహాల కొరత వల్ల అసౌకర్యంతో ఉన్నారు. సుప్రీం కోర్టు హౌసింగ్ కమిటీ ఈ సమస్యను పరిష్కరించడానికి అత్యవసర సమావేశం నిర్వహించింది. గతంలో, జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే, ఎన్‌వీ రమణ వంటి సీజేఐలు రిటైర్మెంట్ తర్వాత కొన్ని నెలలు బంగ్లాలో ఉన్న సందర్భాలు ఉన్నాయి, కానీ అవి అనధికారికంగా, అంత వివాదం లేకుండా జరిగాయి. ఈసారి, సుప్రీం కోర్టు రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది,

Also Read: https://mega9tv.com/national/pakistans-economy-in-deep-crisis-microsoft-leaves-pakistan-foreign-investments-down-by-more-than-50/