మరో సారి తల్లి కాబోతున్న కొణిదల వారి కోడలు…

Spread the love

Upasana Konidela Baby Shower: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,ఉపాసన జంట మరోసారి తల్లితండ్రులు కాబోతున్నారు.ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.దీపావళి పండుగ సందర్భంగా మెగా ఫామిలీ లో ఉపాసన సీమంతం వేడుకులు వైభవంగా జరిగాయి.ఈ సీమంతం వేడుకకు కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సెలెబ్రిటీలు హాజరయ్యారు.ఈ వేడుకను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “డబల్ సెలెబ్రేషన్స్” అంటూ కాప్షన్ పెట్టింది ఉపాసన.ఉపాసన పోస్ట్ చేసిన వీడియోలో చిరంజీవి, సురేఖ,పవన్ కళ్యాణ్ భార్య,నాగబాబు దంపతులు, లావణ్య త్రిపాఠి, ఉపాసన తల్లితండ్రులు, అల్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దీంతో మెగా అభిమానులు సంతోష పడుతున్నారు.”ఈ సారి వారసుడు కన్ఫర్మ్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మొదటి సారి ఆడపిల్ల పుట్టింది.ఆ పాపకి కీంక్లారా అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు కీంక్లారా ని ఒక్కసారి కూడా కెమెరా ముందుకు తీసుకురాలేదు.ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుంది.ఈ సారి మాత్రం మెగా వారసుడు రాబోతున్నాడు అని మెగా ఫ్యాన్స్ సంతోషంగా వున్నారు.