నర్సరావుపేటలో ఎమ్మెల్యే V/S మాజీ ఎమ్మెల్యే!

Spread the love

MLA V/S former MLA: పేటలో వేట మొదలైంది. ఓ హత్య ఇద్దరు రాజకీయ నేతలు మధ్య పెద్ద దూమరం రేపుతుంది. హత్య రాజకీయాలు వారి పేటంటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తుంటే మాది కాదు మీదంటు గతంలోను హత్యలు చేసిన పార్టీ మీదే అని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. అధికారంలో నిజం ఏంటో తెల్చండి అంటు మాజీ ఎమ్మెల్యే సవాల్ చేస్తున్నారు. దీంతో అసలు వాస్తవం ఏంటీ ఈ హత్యలో ఏపార్టీ పాత్ర ఉందో అంటూ ఇరు పాక్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకు ఎక్కడా హత్య జరిగింది..ఎవరు ఆ ఎమ్మెల్యే , ఎవరా మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఒక హత్య రాజకీయ దుమారాన్ని రేపుతుంది. స్వర్గపురి2లో ఎఫ్రాన్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గత 18 నెలలుగా స్వర్గపురిలో పనిచేస్తున్న ఎఫ్రాన్, క్రిస్టియన్‌పాలెం నివాసి అని పోలీసులు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య ఇప్పుడు నర్సరావుపేట రాజకీయాల్లో కలకలం రేపుతుంది. హత్యకు రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉందంటూ టిడిపి ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారం లేపాయి. మృతుడు ఎప్రాన్ ఎన్నికల్లో టిడిపికి మద్దతివ్వటాన్ని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తన అనుచరుల చేత హత్య చేయించాడంటూ ఎమ్మెల్యే అరవింద బాబు ఆరోపించారు. వైసిపి హాయంలోనూ టిడిపి కార్యకర్తలు,నేతలు హత్యలు రాజకీయాలు కొనసాగాయన్నారు.

పట్టణంలోని వరవకట్టకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తిని హత్య చేయగా, అలవాలకు చెందిన వెన్నా బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారన్నారు. ఈ హత్యలకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డే బాధ్యత వహించాలన్నారు. కాటికాపరి ఎఫ్రాన్ ను హత్య చేసింది కూడా గోపిరెడ్డి అనుచరులైన ఖాదర్ అతని బంధువలే అన్నారు. ఆధారాలతో సహా మాట్లాడుతున్నానని ఎమ్మెల్యే చెప్పారు. కిరాయి హత్యలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించడమే కాకుండా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విజ్నప్తి చేశారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదలవాడ అరవిందబాబు కాదు అబద్దాల అరవింద బాబు అంటూ ఫైర్ అయ్యారు.

అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అయింది. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన హత్యలపై సిఐడి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే అరవింద బాబుకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు చేయించడకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు అరవింద బాబు మాత్రం.. ఎఫ్రాన్ ను హత్య చేసింది గోపిరెడ్డి అనుచరలైన ఖాదరే అని బల్లగుద్ది చెబుతున్నారు. తాను అవినీతినికి పాల్పడుతున్నట్లు గోపిరెడ్డి ఆరోపిస్తున్నారని… అవినీతిని నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలి వెళ్లడానికి సిద్దమని ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసిరారు. MLA V/S former MLA.

దీంతో ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. రాజకీయ ఆరోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలు దిగటంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒకప్పుడు అడ్డాగా ఉన్న పేటలో మరోసారి ఇరు పార్టీల నేతల మధ్య మొదలైన వివాదం ఎటు దారి తీస్తుందోనని అందరూ చర్చించుకుంటున్నారు. రాజకీయ, ఫ్యాక్షన్ హత్యలను పక్కన పెట్టి ఇరు పార్టీల నేతలు జిల్లా కేంద్రంగా మారిన నర్సరావుపేట అభివ్రుద్దిపై ద్రుష్టి సారించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఎఫ్రాన్ హత్య ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.