‘స్పిరిట్’ లో వివేక్ ఒబెరాయ్…ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన టీమ్

Spread the love

ఈ ఏడాది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నెక్స్ట్ ప్రభాస్ మన సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి  హీరోయిన్. సందీప్ రెడ్డి వంగ మూవీస్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో అది ప్రూవ్ చేసుకున్నాడు. ఇక స్పిరిట్ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన లుక్ కు సంబంధించిన పోస్టర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ లుక్ లో వివేక్ ఒబెరాయ్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఇక  2027 మార్చి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.  టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ సంస్థలపై ప్రణబ్రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *