ముంబైలో లెజెండరీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఏపీ మంత్రి నారా లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఫిల్మ్ సిటీ ఏర్పాటు, అలాగే సినిమా షూటింగ్ల కోసం సింగిల్ విండో అనుమతుల ప్రక్రియకు ఉన్న అవకాశాల గురించి ఇరువురు చర్చించారు. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందని లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీలో సినిమా షూటింగ్ ఎకోసిస్టమ్ ను నిర్మించే దిశగా అడుగులు వేయడం నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు. ఇక దీనిపై సంజయ్ దత్ కూడా స్పందించారు. లోకేష్ గారు, మిమ్మల్ని కలవడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పట్ల మీకున్న విజన్ మరియు భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుతున్న స్పష్టతను నేను నిజంగా అభినందిస్తున్నాను. మీకు ఏ విధంగానైనా మద్దతు ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని సంజయ్ దత్ పేర్కొన్నారు.