అనుష్కతో పోటీకి సై అంటున్న ఆ ముగ్గురు ఎవరు..?

Spread the love

Ghaati On Sep 5th: అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటీ. క్రిష్ ఈ సినిమా డైరెక్టర్. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి ఓ రిలీజ్ డేట్ అనుకున్నారు. అదే డేట్ కోసం మరో ముగ్గురు పోటీపడుతుండడం విశేషం. అయితే.. మిగిలిన ముగ్గురు కూడా అదే డేట్ కి రావాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. దీంతో నలుగురు మధ్య పోటీ తప్పడం లేదని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. అనుష్కతో పోటీకి సై అంటున్న ఆ ముగ్గురు ఎవరు..?

యధార్థ సంఘటనలు ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన సినిమా ఘాటీ. ఇంకా చెప్పాలంటే.. అనుష్కను కొత్తగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో అనుష్క కనిపించనుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాయి. ఏప్రిల్ లో ఘాటీ రిలీజ్ కావాలి కానీ.. కుదరలేదు. ఆతర్వాత జులైలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇది కూడా కుదరలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ నే లాక్ చేశారని త్వరలోనే ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. Ghaati On Sep 5th.

అయితే.. ఈ డేట్ నే ఘాటీ కాకుండా మూడు సినిమాలు రాబోతున్నాయి. అంటే సెప్టెంబర్ 5న మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు అంటంటే.. తేజ సజ్జ నటిస్తోన్న మిరాయ్ సినిమా కూడా సెప్టెంబర్ 5నే రాబోతోంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జ నుంచి వస్తున్న సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది. ఓటీటీ సంస్థ కూడా సెప్టెంబర్ 5నే ఈ సినిమాని విడుదల చేయాలని కండీషన్ పెట్టిందని తెలిసింది.

ఇక నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న మూవీ గాళ్ ఫ్రెండ్. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ సినిమాని కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ చేయనున్నారు. అంటే.. అనుష్క ఘాటీ, రష్మిక గాళ్ ఫ్రెండ్, తేజ సజ్జ మిరాయ్ ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ 5నే రాబోతున్నాయి. వీటితో పాటు తమిళ చిత్రం మదరాసి కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ కానుంది. శివ కార్తికేయన్ నటించిన సినిమా ఇది. ఇలా నాలుగు సినిమాలు సెప్టెంబర్ 5నే థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుండడం ఆసక్తిగా మారింది. మరి.. ఈ నలుగురులో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/does-prabhas-rajasaab-is-going-to-be-postponed-for-another-time-here-is-what-we-know/