శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మృత్యంజయ్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను అగ్రహీరో ఎన్టీఆర్ విడుదల చేశారు. ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికర అంశాలతో రూపొందినట్లు ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ మూవీ టీమ్ కు ఈ సినిమా ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
సన్నీగుణ్ణం గత కొన్నేళ్లుగా నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మా 18 ఏళ్ల స్నేహంలో నేను గమనించింది ఏమిటంటే, తన తండ్రి గున్నం గంగరాజు గారి లాగే, సన్నీకి కూడా విభిన్నమైన కథలను గుర్తించే అద్భుతమైన నేర్పు ఉంది. అలాంటి ఒక వైవిధ్యమైన స్క్రిప్ట్‌తో ‘మృత్యంజయ్’ సినిమా ద్వారా నిర్మాతగా తన మొదటి అడుగు వేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మృత్యుంజయ్ సినిమా ఎంతో ఉత్కంఠభరితంగా ఉండి, సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
దర్శకుడు హుస్సేన్, శ్రీవిష్ణు మరియు ఈ చిత్ర బృందానికి మార్చి 6న విడుదలవుతున్న సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు.