మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, దోమల నివారణ, చెత్త సేకరణ – నిర్వహణ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్ట్రీట్ లైటింగ్ నిర్వహణకు సాంకేతికతను అనుసంధానం చేసి, సమస్య తలెత్తినప్పుడు తక్షణం పరిష్కరించేలా కంట్రోల్ రూంతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఆహార నాణ్యతను పాటించే విషయంలో హోటళ్లు, రెస్టారెంట్లకు గ్రేడింగ్ ఇచ్చే అంశాన్ని ఆలోచన చేయాలని సూచించారు. అలాగే నగరంలోని వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.