ఈ సారి మరింత భారీగా మిరాయ్ 2

Spread the love

గతేడాది టాలీవుడ్‌ లో భారీ విజయాలు అందుకున్న చిత్రాల్లో ‘మిరాయ్’ ఒకటి.  యువ హీరో తేజా సజ్జా కథానాయకుడిగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన అడ్వెంచర్,థ్రిల్లింగ్ యాక్షన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విజువల్స్, కథ చెప్పిన తీరు, భారీ టేకింగ్ ఈ సినిమాను మరో లెవెల్‌ కు తీసుకెళ్లాయి. చిన్న సినిమాగా మొదలైన ‘మిరాయ్’ చివరికి బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే బ్లాక్‌ బస్టర్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మిరాయ్ 2’ పేరుతో సీక్వెల్ పనులు అధికారిక ప్రకటనకు ముందే ప్రారంభమయ్యాయని సమాచారం. ఈసారి మొదటి భాగాన్ని మించిన స్థాయిలో కథ, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని ఫిలింనగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా పార్ట్-1 ఇచ్చిన విజయంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మిరాయ్’ మొదటి భాగంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖ్యమైన అంశం దాని కథా ప్రపంచం. సైన్స్ ఫిక్షన్‌కు అడ్వెంచర్ అంశాలను కలిపి, ఇండియన్ మైథాలజీ టచ్‌తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చూపించిన ప్రపంచం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు రెండో భాగం అంతకు మించి ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కించనున్నట్లు  తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్‌లో అసలైన ఆకర్షణ ఏమిటంటే, ఇందులో విలన్ పాత్రలో రానా నటించనున్నాడన్న వార్త. ‘అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఇది నిజమో కాదో తెలీదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజ సజ్జా హీరోయిజానికి రానా విలనిజం జత అయితే సినిమా మరో రేంజ్‌కు వెళ్లిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే మొదటి పార్ట్ లో ఆకట్టుకున్న మంచు మనోజ్ కూడా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల వరుస ప్రాజెక్ట్‌లతో మళ్లీ బిజీ అవుతున్న మంచు మనోజ్, ‘మిరాయ్ 2’లో ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ చేయబోతున్నాడట. అయితే ఆయన పాత్ర హీరో వైపు ఉంటుందా? లేక మరో గ్రే షేడ్ క్యారెక్టర్‌గా ఉంటుందా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు. కానీ మనోజ్ ఎంట్రీ మాత్రం ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పార్ట్-1 విజయం తర్వాత ఈసారి ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను రూపొందించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక హీరో తేజ సజ్జా కెరీర్ విషయానికి వస్తే, ఆయన ఇప్పుడు పూర్తిగా ఫ్రాంచైజ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ‘హనుమాన్’ తర్వాత ఆయనకు వచ్చిన పాన్ ఇండియా గుర్తింపు, ఇప్పుడు ‘మిరాయ్’ విజయంతో మరింత బలపడింది. అందుకే వరుసగా సీక్వెల్స్ ఇంకా యూనివర్స్ స్టైల్ సినిమాలపై ఫోకస్ పెంచుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కాంతారా’ వంటి సినిమాలు ఆ ట్రెండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు అదే దారిలో ‘మిరాయ్ 2’ కూడా భారీ అంచనాలతో ముందుకు వస్తోంది. ముఖ్యంగా యువ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. మొత్తానికి చూస్తే ‘మిరాయ్ 2’ కేవలం ఓ సాధారణ సీక్వెల్ కాదు. ఇది తేజ సజ్జా కెరీర్‌లో మరో భారీ మైలురాయిగా మారే అవకాశం కనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *