బాక్సాఫీస్‌ను గట్టిగా షేక్ చేసిన ‘ధురంధర్’ సినిమాతో దర్శకుడిగా మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నారు ఆదిత్య ధార్. ఇప్పుడు అదే ఊపుతో ‘ధురంధర్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆదిత్య ధార్ ఒక భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ న్యూస్ బన్నీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతుండగా, మరోవైపు ఈ కాంబినేషన్ గురించి గతంలోనే ఓ కథా చర్చ జరిగిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆదిత్య ధార్ పేరు ఇండస్ట్రీలో మొదటిసారి గట్టిగా వినిపించింది 2019లో వచ్చిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో. దర్శకుడిగా ఇది ఆయన తొలి సినిమా అయినప్పటికీ, డెబ్యూతోనే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన ‘ధురంధర్’ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో ఆదిత్య ధార్ పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇదే సమయంలో, ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన మార్కెట్ నార్త్ ఇండియాలో విపరీతంగా పెరగడంతో, బాలీవుడ్‌లోని పలువురు అగ్ర దర్శకులు, నిర్మాతలు బన్నీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఆదిత్య ధార్ కూడా అల్లు అర్జున్‌ను సంప్రదించి ఓ కథ వినిపించారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆ కథ పురాణ నేపథ్యంతో, ముఖ్యంగా అశ్వత్థామ పాత్ర చుట్టూ తిరిగే కథ అని, అదే ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని టాక్ వినిపించింది. మొదట ఈ కథను విక్కీ కౌశల్‌తో చేయాలనే ఆలోచనలో ఉండేవాడట ఆదిత్య ధార్. అయితే అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, బన్నీతో ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఆసక్తి దర్శకుడికి కలిగిందని సమాచారం. కథ నచ్చడంతో అల్లు అర్జున్ కూడా సానుకూలంగా స్పందించాడట. కానీ అదే సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ సినిమా రావడంతో పరిస్థితి మారిందని అంటున్నారు.
‘కల్కి 2898 AD’ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అయినప్పటికీ, భారత పురాణాలను భవిష్యత్తు ప్రపంచంతో మేళవిస్తూ రూపొందించిన ఫిక్షనల్ పాన్ ఇండియా సినిమా. ఇందులో కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, అశ్వత్థామ వంటి ఐకానిక్ పాత్రలు కీలకంగా కనిపించాయి. ప్రభాస్ బౌంటీ హంటర్‌గా, అలాగే కర్ణుడిగా ద్విపాత్రాభినయం చేయగా, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా నటించారు. 2024లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు, ప్రేక్షకుల్లో అశ్వత్థామ క్యారెక్టర్‌పై బలమైన ముద్ర వేసింది. దీంతో, ఇదే పాత్ర ఆధారంగా అల్లు అర్జున్ – ఆదిత్య ధార్ కలిసి చేయాలనుకున్న ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారనే వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఆడియన్స్ చూసేసిన కాన్సెప్ట్‌తో మరో సినిమా చేయడం అవసరం లేదని భావించి, ఆ మైథాలజికల్ ఐడియాను తాత్కాలికంగా వదిలేశారని టాక్. ముఖ్యంగా ‘ధురంధర్’ ఘన విజయం తర్వాత ఈ విషయం బయటకు రావడంతో, అప్పటి చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం ‘ధురంధర్’ సక్సెస్ అనంతరం ఆదిత్య ధార్ మరోసారి అల్లు అర్జున్‌ను కలిసి, తన కొత్త డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వివరించారట. ఈసారి కథ పూర్తిగా కొత్తగా ఉంటుందని, ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ముందుగా ‘ధురంధర్ 2’ పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చని టాక్. ఏదేమైనా, అల్లు అర్జున్ – ఆదిత్య ధార్ కాంబినేషన్ తెరపైకి వస్తే అది పాన్ ఇండియా స్థాయిలో భారీ సంచలనంగా మారడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. మాస్ ఇమేజ్ ఉన్న హీరో, స్ట్రాంగ్ కంటెంట్‌తో సినిమాలు చేసే దర్శకుడు కలిసి వర్క్ చేస్తే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబో నిజంగా సెట్ అవుతుందా? ఎం అంటారు???