‘పెద్ది’ సినిమాలో చరణ్ తో ఆడి పాడేది ఈ హీరోయినేనా…?

Spread the love

తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన విజువల్స్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన లుక్ చాలా రగ్గడ్‌గా, గ్రామీణ నేపథ్యానికి దగ్గరగా ఉండటం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. బుచ్చిబాబు సాన “పెద్ది” చిత్రాన్ని ఆయన ఎంతో గ్రాండ్‌గా, ఎపిక్ స్కేల్‌ లో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కథలో ఉన్న ఎమోషన్స్ , మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పాటలతోనే సినిమా మీద ఉన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ లో కూడా చరణ్ డాన్స్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.  అందుకే ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి ఎవరు డ్యాన్స్ చేయబోతున్నారు అనే విషయం చాలా రోజులుగా బజ్ క్రియేట్  చేస్తుంది. మొదట్లో ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. ఆమె ఇటీవల తెలుగు సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమె ఈ పాటలో కనిపిస్తారని కొందరు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం మరో కొత్త పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆ పేరు మానస వారణాసి ఇటీవల ఆమె నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిపి ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే క్రేజ్ కారణంగా పెద్ది సినిమాలో ఆమెను స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే రామ్ చరణ్‌తో కలిసి మానస వారణాసి చేసే డ్యాన్స్ అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వవచ్చు. ఇప్పటికే మాస్ ఎనర్జీతో నిండిపోయిన ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కూడా మరో హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా థియేటర్లలో ఈ పాటకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *