మొన్న రాత్రి అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్ పెళ్లి సందర్బంగా మొదటి పెళ్లి పత్రిక మెగాస్టార్ చిరంజీవి కి సురేఖ గారికి అందించారు కదా… ఆ వార్త శిరీష్ సోషల్ మీడియా లో షేర్ చేయగానే, పెళ్లి సంబరం కన్నా ముందే, అయ్యో మన మెగాస్టార్ కి ఏమి అయ్యింది, అయన చేతికి కట్టు ఉంది అసలు మెగాస్టార్ కి ఏమి అయ్యింది అని సోషల్ మీడియా లో బజ్ క్రియేట్ అయ్యింది. ఐతే చిరు ఫాన్స్ కి తనకి ఒక చిన్న సర్జరీ అయ్యిందని క్లారిటీ ఇచ్చారు! శిరీష్ పెళ్లి మొదటి పత్రిక చిరు కి అందించిన పిక్ లో చిరంజీవి భుజానికి సపోర్ట్ పౌచ్ స్లింగ్ ధరించి కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో “చిరంజీవికి ఏమైంది?” అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. అభిమానుల ప్రేమను గమనించిన చిరు వెంటనే ఎక్స్ వేదికగా స్పందిస్తూ, తన భుజానికి చిన్న శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం కోలుకుని మామూలు కార్యకలాపాల్లో పాల్గొంటున్నానని స్పష్టం చేశారు. తనకు విజయవంతంగా చికిత్స చేసి జాగ్రత్తగా చూసుకున్న డాక్టర్ నితిన్ పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనతో కలిసి ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. తన ఆరోగ్యం గురించి చింతించిన అభిమానులందరికీ చిరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.