కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ సీఎం, బీ.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం.కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ గారు. నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు.. అంతకు మించి నా సర్వస్వం.మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు.రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.ఉద్యమ నిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం… మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ హరీష్ రాసుకొచ్చారు.