ఉమాదేవి చూడ్డానికి ఇన్నోసెంట్..కానీ ఆమె వెరీ వయిలెంట్..పీలేరు మ*ర్డర్ కేసులో నివ్వెరపోయే నిజాలు

Spread the love

అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి, కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన ఆ భార్య.. కట్టుకున్న వాడికే కాలయమురాలిగా మారింది. పసుపు కుంకుమలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకోవాల్సిన ఆ ఇల్లాలు.. ఒక పరాయి వ్యక్తి మోజులో పడి, కన్ను మిన్ను కానక ఏకంగా తన భర్త ప్రాణాలనే బలి తీసుకుంది. తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరు లో జరిగిన ఒక దారుణమైన హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించిన ఆ భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌తో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సీన్ ఆఫ్ అఫెన్స్‌లో దొరికిన ఆధారాలు ఏంటో ఈ వీడియోలో డీటైల్డ్‌గా తెలుసుకుందాం. 

ముఖం చూస్తే ఎంతో ఇన్నోసెంట్.. పాపం ఏమీ ఎరుగని సాధు జంతువులా కనిపిస్తోంది. కానీ, ఆమె చేసిన వయలెంట్ పని గురించి తెలిస్తే పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను కనీసం కనికరం లేకుండా అత్యంత కృూరంగా హతమార్చింది.  అన్నమయ్య జిల్లా పీలేరులోని డిష్ కాలనీకి చెందిన మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం, ఉమాదేవి దంపతులకు దాదాపు 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అన్యోన్యంగా సాగాల్సిన వీరి సంసారంలో కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.సరిగ్గా ఈ క్రమంలోనే భార్య ఉమాదేవికి.. చంద్రగిరి మండలానికి చెందిన 32 ఏళ్ల  చారాల సుబ్రహ్మణ్యం తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. గడచిన రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ఈ చీకటి బంధం కొనసాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమ ఈ అక్రమ సంబంధానికి భర్త వెంకట సుబ్రహ్మణ్యం తీవ్ర అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమాదేవి.. తన ప్రియుడితో కలిసి భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. 

భర్తను చంపడానికి వారు ఎంచుకున్న రోజు ఆగస్టు 7. రాత్రి సుమారు 8 గంటల 30నిమిషాల  సమయం.. భర్త ఇంటికి రాగానే ఉమాదేవి ఎంతో ప్రేమగా భోజనం పెట్టింది. కానీ ఆ ఇడ్లీ, సాంబార్, చట్నీలో ప్రియుడు తెచ్చిచ్చిన పవర్‌ఫుల్ నిద్రమాత్రలను కలిపి ఇచ్చింది. ఏమీ తెలియని ఆ భర్త.. భార్య పెట్టిన భోజనాన్ని తిని కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. భర్త స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్న ఉమాదేవి, రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తన ప్రియుడు చారాల సుబ్రహ్మణ్యాన్ని నేరుగా ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి, మత్తులో ఉన్న వెంకట సుబ్రహ్మణ్యం తలపై ఇనుప రాడ్ ,గుండ్రాయితో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆయన నిద్రలోనే, రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.  హత్య చేయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్లు వేసిన ప్లాన్ మరో ఎత్తు. హత్య విషయం బయటకు రాకుండా, అదొక రోడ్డు ప్రమాదంగా నమ్మించాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఆగస్టు 8 తెల్లవారుజామున సుమారు 2 గంటల 30 నిమిషాలకు .. ప్రియుడు చారాల సుబ్రహ్మణ్యానికి చెందిన  బైక్‌పై మృతదేహాన్ని ఎక్కించుకుని మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారిపైకి తీసుకువెళ్లారు.ఎవరో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతోనే వెంకట సుబ్రహ్మణ్యం చనిపోయాడని అందరినీ నమ్మించేలా మృతదేహాన్ని ఆ హైవేపై పడేసి తిరిగి ఇంటికి వచ్చేశారు. అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, గుండ్రాయి, రక్తపు మరకలు ఉన్న బట్టలను ఒక గోనె సంచిలో కట్టి ఎవరికీ దొరకకుండా సమీపంలోని ఒక కుంటలో పడేశారు. 

నిందితులు ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసినా.. మృతుడి తండ్రి మంగినేని క్రిష్టయ్యకు మాత్రం తన కొడుకు మరణంపై తీవ్ర అనుమానం వచ్చింది. అది కచ్చితంగా రోడ్డు ప్రమాదం కాదని, తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా కోడలు ఉమాదేవి ప్రవర్తనలో మార్పును గమనించిన ఆయన అనుమానమే చివరకు నిజమైంది. క్రిష్టయ్య ఫిర్యాదు మేరకు పీలేరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో, పీలేరు సీఐ జి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసు బృందం.. సాంకేతిక ఆధారాలను సేకరించి అన్ని కోణాల్లో విచారణ జరిపారు. సెల్ ఫోన్ కాల్ డేటా, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్‌తో ఉమాదేవి, చారాల సుబ్రహ్మణ్యం ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పక్కాగా నిర్ధారించారు. ఆగస్టు 11వ తేదీ సాయంత్రం ఏ-1  నిందితురాలిగా ఉన్న ఉమాదేవిని, ఏ-2  గా ఉన్న చారాల సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో వారిద్దరూ నేరాన్ని పూర్తిగా అంగీకరించారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ మిస్టరీని అత్యంత వేగంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రత్యేకంగా అభినందించి, వారికి నగదు రివార్డులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *