ఎన్టీఆర్ డిశ్చార్జ్…త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ఆకాంక్ష

Spread the love

తెలుగు అగ్రనటులలో ఒకరైన ఎన్టీఆర్ కు తాజాగా సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. కిమ్స్ హాస్పిటల్స్ లో  ఈ సర్జరీ విజయవంతంగా జరిగింది. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు లతో కూడిన వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బాగున్నారు. ఈరోజు ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పూర్తిగా విశ్రాంతి తీసుకుని తిరిగి నూతనోత్సాహంతో కనిపించాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి 2 నుండి 3నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సర్జరీ తరువాత ఆయన డాక్టర్ల బృందంతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అలాగే తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కథా నేపథ్యంలో సినిమా చేయనున్నారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న‘డ్రాగన్’ సినిమా జూన్ 11, 2027న విడుదల కానుంది. ఈ సినిమాలోని తారక్ పాత్ర లూగర్. చూస్తుంటే, ఒక భారీ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ నీల్ కసిగా పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది. మే 20, 2026న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ రఘువీర్ రాథోడ్ పాత్రలో, రుక్మిణి వసంత్, బిజు మీనన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ‘డ్రాగన్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా కుమార స్వామి నేపథ్యంతో తెరకెక్కనుంది. త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో కథలను రూపొందించడంలో దిట్ట. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక అంశాన్ని ఎంచుకోవడం సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *