ఫిబ్రవరి నెలకు గానూ భారత ఉమెన్స్ క్రికెటర్ అరుంధతి రెడ్డి ఐసీసీ బెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ గా నిలిచారు. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ లో అరుంధతి మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత్ 2-1తో సిరీస్ గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ అవార్డు లభించడం పట్ల ఆమె స్పందిస్తూ గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో ఓడించడం అంత తేలిక కాదని వారిపై గెలిచిన తర్వాత ఈ పురస్కారం అందుకోవడం మరింత ప్రత్యేకమని అరుంధతి పేర్కొన్నారు. ఇక మెన్స్ క్రికెట్ విభాగంలో పాక్ ప్లేయర్ సాహిబ్జాదా ఫర్హాన్ కు దక్కింది. టీ 20 వరల్డ్ కప్ లో అతను రెండు సెంచరీలు సాధించాడు. అందులో ఒకటి శ్రీలంక మీద కాగా, మరొకటి నమీబియాపై మొత్తంగా 7 మ్యాచ్ లలో అతడు 383 పరుగులు చేశాడు.