మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ ఎదుట లొంగిపోయారు. విజయవాడలోని సిట్ ఆఫీస్ కు ఆయన తన లాయర్ తో కలిసి వచ్చారు. ఇటీవల అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. వెంటనే ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అరెస్ట్ నుండి రక్షణ కల్పించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఈరోజు సిట్ ఎదుట లొంగిపోయారు.