పెళ్లాన్ని అడిగినట్టే అడిగారు.. అంటున్న శ్రీలీల

Spread the love

ఈ మధ్య సినిమా ప్రమోషన్స్  ని అన్ని రకాలుగా చేస్తున్నారు… ఆన్ లైన్  ప్రొమోషన్స్, ఇంకా ఆఫ్ లైన్ ప్రొమోషన్స్ కూడా… అలానే ఈ మధ్య కాలేజీలలో కూడా ప్రీ-రిలీజ్, సాంగ్ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. సో, ఒక విదంగా కాలేజీ లో ఉన్న అందరి స్టూడెంట్స్ నుంచి మంచి బజ్ వస్తుంది కదా సినిమా పైన… ఇదే ప్లానింగ్ నిర్మాతలది… యాక్టర్స్ డి కూడా. ఇక ఈ ఈవెంట్స్ కి హీరో, హీరోయిన్స్ ఖచ్చితంగా వస్తున్నారు. ఎందుకంటే,వాళ్లే  కదా ముఖ్యం! అలానే హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు కాలేజీ లో జరిగే ఫెస్ట్స్ కి కూడా హాజరవుతూ ఉంటారు…ఇక విషయానికి వస్తే శ్రీలీల ఈ తరం హీరోయిన్స్ లో అగ్రపథాన దూసుకుపోతున్నారు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ సెపెరేట్!  ఈ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ పేరు వినగానే ఇప్పుడు యూత్‌లో వచ్చే హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఓ గ్రాండ్ ఫెస్ట్‌కు హాజరై అక్కడి విద్యార్థులతో కలిసి ఫుల్ జోష్‌లో సందడి చేశారు. కాలేజ్ ప్రాంగణమంతా శ్రీలీల అంటూ మారుమోగిపోగా… ఆ ఎనర్జీని చూసి ఆమె కూడా చాలా ఎంజాయ్ చేసినట్టు కనిపించింది.స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే స్టూడెంట్స్ ఇచ్చిన రెస్పాన్స్ చూసి శ్రీలీల ఒక్కసారిగా ఎమోషనల్‌గా, సరదాగా స్పందించారు.“మిమ్మల్ని చూసిన జోష్‌లో అరిచి అరిచి నా గొంతే పోయింది” అంటూ నవ్వుతూ చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే అక్కడున్న యువత మరింత ఉత్సాహంతో ‘డ్యాన్స్… డ్యాన్స్…’ అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు.అయితే ఆ క్షణంలో శ్రీలీల ఇచ్చిన స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. యువకుల అరుపులు విన్న ఆమె చిరునవ్వుతో,“నిజంగా పెళ్లాన్ని అడిగినట్టే అడిగారు… సరే డ్యాన్స్ చేద్దాం… కమాన్!” అంటూ పాజిటివ్‌గా స్పందించారు. ఆ ఒక్క డైలాగ్‌తోనే స్టేజ్ దగ్గర నుంచి కాలేజ్ గ్రౌండ్ వరకూ చప్పట్లు, కేకలతో మారుమోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి లక్షల వ్యూస్ కొల్లగొడుతోంది.ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్‌లో కూడా ఆమె అడుగులు బలంగా పడుతున్నాయి.