అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ తరువాత చమురు రవాణాలో కీలక మార్గమైన హార్మోజ్ జలసంధిని దాటిన మొట్టమొదటి షిప్ ‘జగ్ విక్రమ్’ మరికొద్ది రోజుల్లో భారత్ చేరనుంది. ఈ గ్యాస్ ట్యాంకర్ 20,000 టన్నుల ఎల్పీజీని తీసుకురానుంది. గల్ఫ్ నుండి ఈ భారీ ఎల్పీజీ లోడ్ తో సురక్షితంగా హార్మోజ్ ను దాటింది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి. మరో 15 ఇండియన్ షిప్స్ పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయని త్వరలో ఇదే మార్గంలో ఆ షిప్ లు కూడా భారత్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒక ఎల్పీజీ ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్.ఎన్.జీ ట్యాంకర్, ఒక కెమికల్ ప్రొడక్ట్స్ ట్యాంకర్, 3 కంటైనర్ షిప్ లు, 2 బల్క్ క్యారియర్స్, 3 ఇతరత్రా షిప్ లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ షిప్ పశ్చిమ హర్మూజ్ ప్రాంతంలోనే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఇది భారత్‌కు బయల్దేరింది. కాల్పుల విరమణ తర్వాత ఈ నౌక ప్రయాణం ప్రారంభం కావడం వల్ల భారత ఫ్యూయల్ సప్లై లో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని నిపుణులు భావిస్తున్నారు.